Wednesday, May 1, 2024
- Advertisement -

హీరో నితిన్ ‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి తేజ దర్శకత్వంలో జయం చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు హీరో నితిన్. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే,అ..ఆ తర్వాత గత ఏడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఇదే ఊపులో “చెక్” సినిమాతో మరో హిట్ కొట్టడానికి రాబోతున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్టవ్వాలని విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా చాలా బలంగా కోరుకుంటున్నాడు.

ఇక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. కరోనా నేపథ్యంలో ఇంతకాలం జనాలు ఎంటర్ టైన్ మెంట్ కి దూరంగా ఉన్నారు. ఈ మద్య థియేటర్లో సినిమాలు రిలీజ్ కావడం.. జనాలు ఆసక్తితో చూడటం జరుగుతుంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నితిన్ తన సినిమాకి వున్న వసూళ్ల టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది.

ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఏపి, తెలంగాణాలో సినిమా 15కోట్ల వరకు బిజినెస్ చేస్టసున్నట్లు తెలుస్తుంది..ఇక కర్ణాటక, ఓవర్సీస్..రెస్ట్ ఆఫ్ ఇండియా.. మొత్తం 1.1కోట్ల వరకు ధర పలికింది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 16.10కోట్ల బిజినెస్ చేస్తోంది. ఇక చెక్ సక్సెస్ కావాలి అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5కోట్లను రాబట్టాలి. ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది.ఇక చూడాలి నితిన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో….

చారిత్రక ఇన్నింగ్స్​ ఆడిన యువ బ్యాట్స్​మన్ పృథ్వీ షా..!

సంచలన ప్రకటన.. పబ్లిక్​ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..!

‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -