Friday, April 26, 2024
- Advertisement -

పుష్ప కోసం బన్నీ ఏం చేస్తున్నాడో తెలుసా..?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో లో ఆర్య, ఆర్య 2 చిత్రంతో మంచి హిట్స్ అందుకున్న దర్శకుడు సుకుమార్. ఈ చిత్రాలతో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప. ఇక ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే…. చిత్తూరి యాసలో డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేస్తూ, తన మేకప్ కోసం చాలా ఓపిగ్గా ప్రతి అంశాన్ని చాలా డిటైల్ గా చేస్తున్నాడట అల్లు అర్జున్.

గతంలో అల్లు అర్జున్ గెటప్స్ కంటే కూడా ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో చాలాసేపు వర్క్ చేయాల్సి వస్తోందని, అందుకే రాత్రిపూట కూడా మేకప్ తోనే ఉండిపోతున్నాడని అదే గెటప్ ని మైయిన్ టైన్ చేస్తూ సినిమాకోసం ఎంతో ఎఫెర్ట్స్ పెడుతున్నాడని అంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని చూస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే పుష్ప సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా ఇంకా 70శాతం చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అందుకోసం అల్లు అర్జున్ తెగ కష్టపడుతున్నాడని చిత్ర బృందం వారు చెప్తున్నారు. ప్రతి సీన్ లో ఒరిజినల్ గా తానే చేస్తున్నాడటని, అస్సలు ఎక్కడా కూడా డూప్‌ను వాడాల్సిన అవసరం కూడా రావట్లేదని అంటున్నారు. మొత్తానికి మాస్ ఎలిమెంట్స్ తో ‘పుష్ప’ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం.

చారిత్రక ఇన్నింగ్స్​ ఆడిన యువ బ్యాట్స్​మన్ పృథ్వీ షా..!

మరో కర సేవకుడు హత్య.. భగ్గుమన్న బిజేపి అర్థ రోజు బంద్..!

మీరు టికెట్ ఇవ్వకపోయినా నేను గెలిచాను ఎలా అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -