అఖిల్ పై ఘోరమైన కామెంట్స్ చేసిన బాలయ్య

balakrishna comments on akhil movie

అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ సినిమాపై నందమూరి బాలకృష్ణ కౌంటర్ వేశారు. తన 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ప్రమోషనలో ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పరోక్షంగా అఖిల్ ని విమర్శించారు. గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చెప్పాల్సిన బాలయ్య.. అఖిల్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని అనుమానంగా ఉంది కదూ… అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. కొద్ది కాలంగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

మోక్షజ్ఞ తమ బ్యానర్లో మొదటి సినిమా చేస్తారని సాయి కొర్రపాటి స్పష్టం చేశారు కూడా. ఇదే విషయాన్ని బాలకృష్ణ ముందు ఉంచగా.. వారసత్వాన్ని అందుకోవడమంటే అంత తేలిక కాదని చెప్పారు. మొదటి సినిమాతోనే కోట్లు కొల్లగొట్టేయడం కాదని వివరించారు.

ఎవరో చెప్పారని తొందరపడి ప్రపంచాన్ని రక్షించే కథతో సినిమా చేయకూడదని పరోక్షంగా అఖిల్ ని విమర్శించారు. నందమూరి పరువు, ప్రతిష్టను కొనసాగించే బాధ్యత మోక్షజ్ఞకు ఉంది. అందుకు తగినట్లుగా కథలు ఎంచుకోవాలి. ఆ కథల్లో మెప్పించేలా నటించాలి. స్టోరీలు సిద్ధంగా ఉన్నాయి. మోక్షు కు ఇంకొంత సమయం పడుతుంది. అతను సిద్ధం కాగానే సినిమా మొదలు పెడతాం” అని స్పష్టం చేశారు. ఎవరు తొందర పెట్టిన తాను తొందరపడనని తెలిపారు. అఖిల్ లాంటి చిత్రం తీసి ప్లాప్ చూసే కన్నా.. అలోచించి మంచి సినిమా తీసుకోవడమ్ మంచిదని చెప్పకనే చెప్పారు. 

Related

  1. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!
  2. బాలయ్య కి చంద్రబాబు సంక్రాంతి సూపర్ కానుక
  3. ఖైదీ పాటలకు స్టెప్పులు వేసిన బాలయ్య!
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!