Saturday, April 27, 2024
- Advertisement -

విరాట్ మొదటి పరీక్షలోనే సంచలనం సృష్టించాడు!

- Advertisement -
Viratkohli’s debut is a grand sucess

యువ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి వన్డే జట్టు కెప్టెన్‌గా మొదటి బోణి చేశాడు. ఇంగ్లాండ్‌పై భారత్‌ మూడు వికెట్ల తేడాతో గెలుపు సాధించిన విషయం తెలిసిందే. ఏ మ్యాచ్ అయిన ప్లేయర్ల పై కన్నా కెప్టెన్ మీదనే ఎక్కువ వత్తిడి, బాధ్యత ఉంటుంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. ఆ  మ్యాచ్‌లో 350 స్కోర్ చేజ్‌ చేయాల్సి వచ్చినప్పుడు మరింత వత్తిడి ఉంటుంది.

కానీ, కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రెషర్ పడకుండా చూసుకున్నాడు. థోనీ నుంచి వన్డే కెప్టెన్‌ గా పగ్గాలు స్వీకరించిన మొదటి మ్యాచ్‌లో విరాట్ ఎటువంటి ఒత్తిడి లేకుండా తన బ్యాట్‌ను సెంచరీ వైపు తీసుకెళ్ళాడు. దీంతో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రెండో పరీక్షను అతడు నెగ్గాడు. 350 పరుగులు అంతకంటే ఎక్కువ పరుగు లక్ష్య చేధనలో భారత్‌కు మూడో విజయాన్ని అందించిన ఘనత కూడా కోహ్లికే దక్కుతుంది. ఇక, టీ-20 కెప్టెన్‌గా అతడు సత్తా చాటడం లాంఛనప్రాయమే అవుతుంది.

ఎందుకంటే, ఐపీఎల్‌ లో రాయల్స్ ఛాలెంజెర్స్ తరపున కెప్టెన్‌గా దిగ్గజాలను సమర్థవంతంగా లీడ్ చేసిన ఘనత విరాట్‌కు ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే..  టాస్‌ గెలిచిన విరాట్‌ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 350/7 పరుగులను చేసింది. 350 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 48.1 ఓవర్లలోనే 356 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది. ఇంగ్లాండ్‌ మూడు అర్ధ శతకాలు నమోదు చేయగా, భారత్‌ రెండు సెంచరీలతో దుమ్ము రేపింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉండగా.. రెండో వన్డే ఈ నెల 19న కటక్‌లో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -