Sunday, May 19, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!

- Advertisement -
bumper chance balayya babu

బాల‌య్య కేరీర్‌లో ల్యాండ్ మార్క్ మూవీగా తెర‌కెక్కిన శాత‌క‌ర్ణి సినిమా అటు మేథావుల ప్ర‌శంస‌ల‌తో పాటు ఇటు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గాను దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించి డైరెక్ట‌ర్ క్రిష్‌తో పాటు హీరో బాల‌కృష్ణ‌, హీరో శ్రేయ పాత్ర‌ల‌కు కూడా మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే బాలకృష్ణ తదుపరి సినిమాలోను శ్రియకి ఛాన్స్ తగలనుందనే వార్త ఫిల్మ్ నగర్‌లో పుకార్లు.. షికార్లు చేస్తోంది. బాలకృష్ణ 100వ చిత్రమైన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాలో, ‘శాతకర్ణి’ భార్య పాత్ర వ‌శిష్టీ దేవిగా శ్రియ ఆ పాత్రలో ఇమిడిపోయింది. హిస్టారిక‌ల్ మూవీలో ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగాను, మ‌హారాజు భార్య‌గాను శ్రేయ చేసిన పాత్ర‌ను అంద‌రూ మెచ్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య సైతం శ్రేయ పాత్ర‌ను పలు ఇంటర్వ్యూలలో స్వయంగా మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో శ్రియకు ఓ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట బాల‌య్య‌. మ‌నం క‌లిసి మ‌రో సినిమా చేద్దాం. ఈసారి క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేద్దాం అనే చెప్పాడ‌ట‌.

దాంతో బాల‌య్య నెక్ట్స్ సినిమాలోను ఆమెనే నాయిక అన్న టాక్ వ‌చ్చేసింది. గతంలో నయనతార, రాధికా ఆప్టేకి వెంటవెంటనే ఛాన్స్ ఇచ్చిన బాల‌య్య శ్రియ‌కు కూడా అలాగే అవ‌కాశం ఇస్తాడేమో చూడాలి. బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ‌వంశీ రైతుతో పాటు మ‌రో ఒక‌టి రెండు క‌థ‌లు కూడా లైన్లో ఉన్నాయి. వీటిలో ఏది ఫైన‌లైజ్ అవుతుందో చూడాలి.

Related

  1. బికినీలో యోగ చేస్తూ పిచ్చేక్కించిన హీరోయిన్!
  2. ఐటెం గర్ల్స్ గా మారుతున్న తెలుగు హీరోయిన్లు!!
  3. సమంత.. హీరోయిన్ ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు!
  4. వ్యభిచార గృహం నడుపుతున్న హీరోయిన్ విద్యాబాలన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -