Wednesday, May 1, 2024
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యం.. ఆ పోలీస్ మృతి..!

- Advertisement -

హైదరాబాద్ నిజాంపేటలో ఈనెల 27న డ్రంక్​ అండ్​ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై అన్నపురెడ్డి మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బ్రెయిన్​ డెడ్​ అయి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.

మహిపాల్​రెడ్డి అంత్యక్రియలను బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిస్మత్​పూర్​లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిపాల్​రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్సై మృతి వార్త తెలుసుకున్న గ్రామస్థులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద శనివారం రాత్రి 11 గంటలకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ సమయంలో రోడ్డుప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలిని పరిశీలించేందుకు ఎస్సై సక్రమ్, ఏఎస్సై మహిపాల్​రెడ్డి వెళ్లారు.అదే సమయంలో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి.. కారుతో దూసుకొచ్చాడు.

మద్యం మత్తులో దొరికితే శిక్ష పడుతుందని తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా పోలీసులపైకి కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో మహిపాల్​ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఏఎస్సై ప్రాణాపాయస్థితిలో ఉండగా.. కొండాపూర్​ కిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు.

సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీకి వరుస షాకులు!

ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలు భ్రష్టు పట్టించారు: మంత్రి కొడాలి నాని

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -