Tuesday, April 30, 2024
- Advertisement -

సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీకి వరుస షాకులు!

- Advertisement -

తెలంగాణలో నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు నామినేషన్ విషయంలో కాంగ్రెస్ తరుపు నుంచి జానారెడ్డి విషయంలో క్లారిటీ ఉన్నా.. టీఆర్ఎస్, బీజేపీ క్యాండిడెట్ల విషయంలో సందిగ్ధత నెలకొంటూ వచ్చింది. మొత్తానికి టీఆర్ఎస్ క్యాండిడెట్ గా నోముల నరసింహ తనయుడు నోముల భగత్ నామినేషన్ వేయగా.. బీజేపీ తరుపు నుంచి  రవికుమార్ నాయక్‌ను ప్రకటించారు.

ఇదిలా ఉంటే మొదటి నుంచి సాగర్ ఉప ఎన్నికలో తనకే ఖచ్చితంగా పార్టీ టికెట్ తనకే దక్కుతుందని భావించి భంగపడిన ఆ పార్టీ నేత కడారి అంజయ్య యాదవ్ నిన్న టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. మరో నేత కంకణాల నివేదితారెడ్డి బీజేపీ రెబల్‌గా నామినేషన్ వేశారు.

కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున నాగార్జున సాగర్‌లో పోటీ చేసిన అంజయ్య యాదవ్ కు 27 వేల ఓట్లు లభించాయి. ఏడాదిన్నర క్రితమే ఆయన బీజేపీలో చేరారు. మరోవైపు కంకణాల నివేదితారెడ్డి తో సైతం టీఆర్ఎస్ సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఆమె కనుక టీఆర్ఎస్‌లో చేరితే నామినేషన్ ఉపసంహరించుకుంటారని సమాచారం.

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్!

పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

మాస్క్ లేక పోతే మోత మోగినట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -