Sunday, April 28, 2024
- Advertisement -

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస‌గా సినిమాల్లో న‌టిస్తూ దూసుకుపోతున్నాడు. చెక్‌, రంగ్‌దే సినిమాల త‌ర్వాత ఆయ‌న‌ న‌టిస్తోన్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు విడుద‌ల‌య్యాయి. గ‌తేడాది భీష్మ‌కు ముందు ఏడాదిన్న‌రపాటు నితిన్ సినిమాలేమీ చేయ‌లేదు. ఈ ఏడాది వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు. నితిన్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ రీమేక్ కు మ‌స్ట్రో అనే టైటిల్ ను ఖ‌రారు చేసి చిత్ర బృందం నేడు నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, తమన్నా కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు మహతీసాగర్ సంగీతం అందిస్తున్నారు.‌ మాస్ట్రో  ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ వీడియోలో నితిన్ మ్యూజిక్ వాయిస్తూ క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో అందుడిగా క‌నిపిస్తున్న‌నితిన్ లుక్ ను గ్లింప్స్‌లో చూపించారు. ఈ గ్లింప్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ.. రాజా ది గ్రేట్‌ లా.. నితిన్‌ ది గ్రేట్‌ అని కామెంట్స్‌ చేస్తుండటం విశేషం. 

మాస్క్ లేక పోతే మోత మోగినట్టే..!

పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

మరో నెలలో జగన్ మళ్లీ పథకాల వర్షం.. అంతా సిద్దం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -