నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎన్టీఆర్. ముమ్మూర్తులా సీరియన్ ఎన్టీఆర్ పోలికతో ఉన్న ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే రాజమౌళితో స్టూడెంట్ నెం.1,సింహాద్రి,యమదొంగ చిత్రాల్లో నటించి బక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తెరపైనే కాదు.. రియల్ లైఫ్ లో తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు.
లక్ష్మి ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ లకు ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలిసిందే . అభయ్ రామ్, బార్గవరామ్ వారి పేర్లు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.. ఎక్కువ బయటకు రాడన్న విషయం తెలిసిందే. కాకపోతే ఏమాత్రం విరామం దొరికినా తన కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటారు.
తాజాగా ఎన్టీఆర్ తన కొడుకుతో బైక్ ప్రయాణం చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. తన రెండో తనయుడు భార్గవ్‌రామ్‌ను బైక్ మీద ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద షికారుకెళ్లాడు. అయితే ఎన్టీఆర్ సినిమాలోని షూటింగ్ పిక్స్ కూడా ఎక్కువగా కనిపించవు. తాజాగా ఆయన తనయుడుని బైక్ పై ఎక్కించుకొని రోడ్డుపై షికార్లు కొడుతున్న ఫోటో చూసి ఫ్యాన్స్ ఖుషీ గా ఫీల్ అవుతున్నారు.
అసోం మాజీ ముఖ్యమంత్రి భూమిధర్బర్మన్ కన్నుమూత