Tuesday, April 30, 2024
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన సాయి పల్లవి.. కారణం అదేనా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఫిదా చిత్రంతో అందరినీ ఫిదా చేసింది సాయి పల్లవి. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. తనకు నచ్చిన ప్రాజెక్ట్ మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ.. గ్లామర్ కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కేవలం తన నటనతోనే మెప్పిస్తుంది సాయి పల్లవి.

మంచి ఫామ్ లో కొనసాగుతున్న హీరోయిన్లకు బాలీవుడ్ ఏ చిన్న ఛాన్స్ వచ్చినా ఎగిరి గంతేసి కమిట్ అవుతారు. అలాంటిది తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ కోసం స్టార్ హీరోయిన్లను సంప్రదించారు. ఇదే సమయంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవిని కూడా సంప్రదించారట.

అయితే వరుస సినిమాల కారణంగా డేట్స్ ఇవ్వలేనని చెప్పినట్టుగా సమాచారం. సాయిపల్లవి చేసిన ‘లవ్ స్టోరీ’ .. ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘శ్యామ్ సింగ రాయ్’ సెట్స్ పై ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ – వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.

పూరి ‘లైగర్’కి కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అవుతాడా?

టాలీవుడ్ లో విషాదం.. ముగ్గురు ప్రముఖులు మరణం!

తండ్రి శాసిస్తాడు- త‌న‌యుడు పాటిస్తాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -