Friday, April 26, 2024
- Advertisement -

మీ సేవలు అసామాన్యం.. అందుకే నా సెల్యూట్ : మహేష్ బాబు

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల్లో కేసుల నమోదు.. వేలల్లో మరణాలు సంబవిస్తున్నాయి. చిన్న పిల్లవాడి నుంచి ముదుసలి వరకు కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. అయితే కరోనా రక్కసిని అరికట్టేందుకు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మరణాలు మాత్రం సంబవిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు.

అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారికి సేవలు చేసే చేతులు ఏవైనా ఉంటే అవి సేవామయులైన నర్సుల చేతులే. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మానవ సేవ ద్వారానే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న వారు నర్సులు. ఆపదవేళ ఆత్మీయ స్పర్శ మీది.. ఆరోగ్యం సహకరించక లేవలేని స్థితిలో ఉంటే చేయి అందిస్తారు.. నడవలేకపోతే ఊతమిచ్చి నడిపిస్తారు.. ఎలాంటి బంధుత్వం లేకపోయినా సపర్యలతో ఆత్మీయులవుతున్నారు. అందుకే వారి సేవలకు సలామ్ అంటోంది ఈ లోకం. బుధ‌వారం(మే 12) ఇంట‌ర్నేష‌న‌ల్ న‌ర్సెస్ డే(న‌ర్సుల దినోత్స‌వం).

తాజాగా మహేష్ బాబు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ 19 సెకండ్ వేవ్‌లో క‌ష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితుల్లో న‌ర్సులు ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా అసాధార‌ణ‌మై సేవ‌ల‌ను అందిస్తున్నారు. మీ సేవ‌లు అసామాన్య‌మైన‌వి… మీరు చేస్తోన్న సేవలకు సాటి రాదు.. అనిర్వచనీయం.. మీ బలం, ఆదరణ, మీకున్న నిబద్దతకు థ్యాంక్స్. మీ వల్లే ఆశలు ఇంకా బతికి ఉన్నాయి.

ఇప్పటికీ ఎప్పటికీ మీ వెంట మేముంటాం.. మీకు సపోర్ట్‌గా నిలుస్తాం.. కరోనా సెకండ్ వేవ్ అనేది మనందరికీ ఓ సవాల్ వంటిది.. మనమంతా బాధ్యతగా ఉందాం.. మన రాష్ట్రాల్లోని లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను అని మహేష్ బాబు అన్నారు.

నేను సామాన్యుడిగానే ఉంటా.. ప్రధాని పదవి వొద్దు..!

టాలీవుడ్ లో విషాదం.. ముగ్గురు ప్రముఖులు మరణం!

తండ్రి శాసిస్తాడు- త‌న‌యుడు పాటిస్తాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -