టాలీవుడ్ లో విషాదం.. ముగ్గురు ప్రముఖులు మరణం!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసుల సంఖ్య బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు నాలుగు లక్షల వరకు కేసులు పెరిగిపోయాయి… మూడు వేల మరణాలు సంబవిస్తున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ సినీ తారలకు శాపంగా మారిందనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్ లో ఒకే రోజు వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ కరోనాతో మరణించగా డబ్బింగ్‌ ఇంఛార్జ్‌ కాంజన బాబు కరోనా, గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

దాసరి నారాయణరావు శిష్యుడు, దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌ కరోనాతో మరణించారు. సంగీత దర్శకుడు కె.ఎస్‌.చంద్రశేఖర్‌ పశ్చిమగోదావరి జిల్లా రాయలం గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 1990లో ఆల్‌ ఇండియా రేడియోలో గ్రేడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించి.. విశాఖ వాసులకు బాగా దగ్గరయ్యారు. అల్లు రామలింగయ్య ‘బంట్రోతు భార్య చిత్రంతో నేపథ్య గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్ర శేఖర్‌ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్‌ అసోసియేట్‌గా పని చేశారు.

- Advertisement -

చిరంజీవి హీరోగా అల్లు అరవింద్‌ నిర్మించిన ‘యమకింకరుడు’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, బోళా శంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్‌, హిందీ) ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇక ప్రస్తుత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి. కాంచన్‌ బాబు కరోనాతో మృతి చెందారు. చెన్నైలో పుట్టి పెరిగిన కాంచన్‌ బాబు తండ్రి వీరమాచినేని కృష్ణారావు పలు చిత్రాల్లో నటించారు.

దాంతో కాంచన్‌ బాబుకు కూడా నటనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మారి రాజశ్రీ, ఘంటసాల రత్నకుమార్‌ వద్ద 1000కి పైగా చిత్రాల్లో పలు పాత్రలకు తన గొంతు అరువిచ్చారు. డబ్బింగ్‌ ఇన్‌ఛార్జ్‌గా మారి దాదాపు 2000 వేలకు పైగా సినిమాలకు పని చేశారు. దర్శకుడు, దాసరి శిష్యుడు అక్కినేని వినయ్ కుమార్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 65 సంవత్సరాలు.

‘ఏడంస్తుల మేడ’ నుంచి దాసరి వద్ద శిష్యరికం చేసిన వినయ్ కుమార్ ‘పవిత్ర’ సినిమాకు దర్శకత్వం వహించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ‘సుందరవదన సుబ్బలక్ష్మి మొగుడా’ సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించారు వినయ్. ఇక సూపర్ హిట్ టీవీ సీరియల్ ‘అంతరంగాలు’తో పాటు అక్కినేని వినయ్ కుమార్ ‘నా మొగుడు నాకే సొంతం, అమ్మ, ఆరాధన’ వంటి పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించారు.

భారత్ ప్రైమ్ మినిస్టర్ సోనూసూద్‌.. సోను సూద్ రియాక్షన్…!

కాస్త మంచి ఫోటోలు పెట్టు విష్ణు ప్రియా.. అంటూ నెటిజన్ కామెంట్.!

కుత్బుల్లాపూర్‌లో పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -