Thursday, April 25, 2024
- Advertisement -

పూరి ‘లైగర్’కి కూడా ఆ సెంటిమెంట్ ఫాలో అవుతాడా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో బద్రి చిత్రంతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. తర్వాత మహేష్ బాబు తో ‘పోకిరి’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన సినిమాల్లో హీరోయిజంతో పాటు పంచ్ డైలాగ్స్ తో పూరి ఆడియన్స్ ని బాగా ఆకర్షిస్తుంటాడు. గత ఏడాది హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక టాలీవుడ్ లో అన్ని రంగాల్లో వారికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ – పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పూరికి కూడా కొన్ని సెంటి మెంట్స్ ఉన్నాయని పలుమార్లు చెప్పారు. తను కథ తయారు చేసుకోవడానికి బ్యాంకాక్ వెళ్తాడని.. ఆయన దర్శకత్వంలో వచ్చే ప్రతీ సినిమాలో బీచ్ సాంగ్ తప్పకుండా ఉంటుంది.

ఇది పూరికి సెంటిమెంట్ అని కొందరు అంటుంటారు. ‘ఇడియట్’, ‘పోకిరి, ‘చిరుత’ ‘బిజినెస్ మాన్’, ‘గోలీమార్’, ‘సూపర్’ సహా పూరి గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’లోనూ బీచ్ సాంగ్స్ యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ‘లైగర్’ మూవీలో విజయ్ దేవరకొండ – అనన్య పాండేల మీద బీచ్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక మారిషస్ లేదా మాల్దీవుల్లో ఈ సాంగ్ షూట్ చేయనున్నట్టు సమాచారం.

టాలీవుడ్ లో విషాదం.. ముగ్గురు ప్రముఖులు మరణం!

కడప జిల్లా పేలుడు కేసులో వైఎస్ ప్రతాపరెడ్డి అరెస్ట్

ఎన్టీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -