సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో సురేఖవాణి తన కూతురు సుప్రీత కలసి చేసే రచ్చ మామూలుగా ఉండదు. సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేశారు.
సోషల్ మీడియాలో ఈ తల్లీకూతుళ్లు చేసే డాన్సులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కూతురుతో కలిసి స్టెప్పులేసిందంటే సోషల్ మీడియా దద్దరిల్లి పోవాల్సిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎన్నో డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇక తాజాగా మరోసారి తల్లీ కూతుళ్లు ఇద్దరు చీరలు కట్టుకొని చేస్తున్న రచ్చ మాములుగా లేదు.
Also read:సమంత, నాగచైతన్య కాంబోలో సినిమా.. ఫ్యాన్స్ కు పండగే?
తల్లి సురేఖ వాణితో పాటు సుప్రీత చీర కట్టి తీన్మార్ స్టెప్పులు వేసి ఈ వీడియోనుసోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ విధంగా తల్లీకూతుళ్ల మాస్ డాన్స్ ఎనర్జీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 2 సంవత్సరాల క్రితం భర్తను పోగొట్టుకున్న సురేఖవాణి ప్రస్తుతం తన కూతురుతో కలిసి ఉన్నారు.గతంలో ఈమె కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో తల్లి కూతుర్లు ఇద్దరు స్పందించి తన తల్లి గురించి వస్తున్న తప్పుడు వార్తలు పై తీవ్రంగా స్పందించారు.
Also read:సాయి పల్లవి ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?