Wednesday, April 24, 2024
- Advertisement -

పవన్ తో మూవీపై బండ్ల గణేష్ ఏమన్నారో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా తనదైన మార్క్ చాటుకున్నారు బండ్ల గణేష్. తర్వాత నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ చిత్రాలు అందించారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టంగా ఉండే బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన దేవుడు అని అంటారు. ఏ రిలీజ్ ఫంక్షన్ అయినా సరే తన దేవుడు పవన్ కళ్యాణ్ గురించి గుర్తు చేయడం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. గబ్బర్ సింగ్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తేలిసిందే. తనని నిర్మాతగా నిలబెట్టింది పవన్ కల్యాణ్ కనుక, ఆయనకి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని గణేశ్ చెబుతూ ఉంటాడు.

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో మరో మూవీ తీయాలని చూస్తున్న సమయం రావడం లేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతే కాదు వరుస పెట్టి మూవీల్లో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ తో బండ్ల గణేష్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో తనతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పాడు.

రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ ఆ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా ఉండబోతున్నారని ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై స్పందించిన బండ్ల గణేష్ అలాంటి వార్తలో అస్సలు నిజం లేదని అన్నారు. ప్రస్తుతం ఆయన వేరే చిత్రాలపై ఫోకస్ పెట్టారని.. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నాడు.

కొత్త డైరెక్టర్ తో వైష్ణవ తేజ్ సినిమా.. పాత్ర ఏంటంటే?

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్..

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: శ్రీకాంత్‌రెడ్డి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -