Wednesday, May 8, 2024
- Advertisement -

భర్తపై అలా కామెంట్స్ చేసిన యాంకర్ సుమ…?

- Advertisement -

టాలీవుడ్ బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ దాదాపు దశాబ్దకాలం నుంచి బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా కొనసాగుతోంది.చక్కటి అందం, సమయస్ఫూర్తితో అనర్గళంగా మాట్లాడే వాక్చాతుర్యం ఈమె సొంతం. యాంకర్ సుమ మలయాళీ అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల అనర్గళంగా తెలుగు మాట్లాడగలరు. బుల్లితెరపై ఎదురులేని యాంకర్ గా కొనసాగుతూనే సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన కెరీర్ కు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

Also read:మహేష్ బాబుతో నిధి అగర్వాల్ రొమాన్స్.. ఏ సినిమా కోసమంటే?

యాంకర్ సుమ సోషల్ మీడియాలో అభిమానులను ఎంటర్టైన్ చేయడంతో పాటు కరోనా కారణంగా మానసికంగా కుంగిపోయిన ప్రజలకు కొన్ని వీడియోల ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది.తాజాగా తన భర్త రాజీవ్‌ కనకాల నటించిన సినిమా డైలాగ్‌ చెప్పి ప్రజలకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేసింది.

Also read:ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

వివరాల్లోకి వెళితే బ్లాక్ బస్టర్ మూవీ నితిన్” సై “సినిమా లో రాజీవ్ కనకాల రగ్బీ గేమ్ కోచ్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో రాజీవ్ క్లైమాక్స్ సీన్లోనీ డైలాగ్‌ని సుమ అచ్చం అలాగే చెప్పింది. అందరు ధైర్యంగా ఉండాలి, ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది.భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూసి ప్యానిక్ అవ్వకండి అంటూ సలహా ఇస్తున్న వీడియో సుమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -