కన్నడ బ్యూటీ హీరోయిన్ వర్ష బొల్లమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి”చూసి చూడంగానే” చిత్రం ద్వారా పరిచయం అయ్యింది.తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా వచ్చిన” మిడిల్‌క్లాస్ మెలోడీస్” సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే వర్ష బొల్లమ్మ మొదట తమిళం మూవీ “సతురన్”ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తర్వాత 96, బిగిల్ వంటి సినిమాల్లో నటించింది.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ను తన కెరీర్ కు సంబంధించిన విషయాలను తన ఫాలోవర్స్ తో టచ్‌లోనే ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రాంలో అభిమానులతో ముచ్చటిస్తూ సోషల్ మీడియా ఫాలోవర్స్ తో తన కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకోవడం జరిగింది.
Also read:బిడ్డను అదిమిపట్టుకున్న అనుష్క శర్మ.. ఫొటోగ్రాఫర్లు దారుణంగా?
సరదాగా సాగిన లైవ్ చిట్ చాట్‌లో హీరోయిన్ వర్ష బొల్లమ్మను ఓ నెటిజన్ ఆమె వయసు గురించి కామెంట్ చేస్తూ నీకు 25 ఏళ్లు అని గూగుల్ చూపిస్తోంది. దీనికి మీరేమంటారు అని అడగగా ఈ ప్రశ్నకు సమాధానంగా వర్ష వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ కౌంటర్ వేశారు. నేను మామూలుగా అయితే 96లో పుట్టాను అంటే 24 ఏళ్లు ఉండాలి కదా.నాకు తెలిసి ఈ విషయం మా అమ్మ కంటే గూగుల్‌కే ఎక్కువగా తెలిసి ఉండాలి అంటూ వ్యంగ్యంగా కామెంట్ ఇచ్చింది. దానికి కొందరు ఫాలోవర్స్ వినూత్నంగా స్పందించడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also read:క్రేజి ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ నటులు వీళ్ళే!