జయసుధ భర్త మృతి.. ఆర్థిక ఇబ్బందులు కారణమా..?

Actor Jayasudha Husband No More

నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కపూర్ అకాల మరణం చెందారు. నితిన్ మరణ వార్త తెలియగానే జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లారు. ప్రముఖ నటుడు జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్. నితిన్ కపూర్ పలు సినిమాలకు నిర్మాతగా కూడా చేశారు.

జయసుధ కుటుంబం కొద్దికాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నితిన్ కపూర్ మృతి కారణం ఆర్థిక ఇబ్బందులా ? లేక అనారోగ్యమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. జయసుధ హీరోయిన్ గా నితిన్ కపూర్ చాలా చిత్రాలు నిర్మించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు వార్తలు అందుతున్నాయి.  

1985లో నితిన్ కపూర్‌తో జయసుధకు వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడి పేరు శ్రేయన్ కపూర్, రెండో కుమారుడి పేరు నిహాన్ కపూర్. కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆయన ఎందుకు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదనే వాదన వినిపిస్తున్నది. నితిన్ కపూర్‌కు ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఏమీ లేవని అంటున్నారు.  నితిన్ కపూర్ అకాల మృతితో పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

{youtube}v=S5DaGzSghKU{/youtube}

Related

  1. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  2. నేను తనలాగే రెండో పెళ్లి చేసుకుంటా.. రేణూ దేశాయ్
  3. సుచిలీక్స్ తో.. హీరోయిన్ సంచితా న్యూడ్ వీడియో లీక్
  4. సింగర్ ని రేప్ చేసిన ధనుష్, అనిరుధ్..బయట పడ్డ నిజాలు