Monday, April 29, 2024
- Advertisement -

151 – 154 అన్ని సినిమాలను రెడీ చేసిన మెగాస్టార్

- Advertisement -
Chiru 151, 154 Movies Ready

టాలీవుడ్ సినిమాల రికార్డుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌.. ఇక నుంచి ఓ లెక్క అనుకోవాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత తన 150వ మూవీ ఖైదీ నంబర్ 150తో వచ్చి త‌న స‌త్తా ఏంటో చూపించాడు. ఖైదీ నంబర్ 150 ఏకంగా రూ.105 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్లో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

ఈ మూవీ ఇచ్చిన జోష్ తో చిరు ఇప్పుడు వ‌రుస‌గా తన మూవీస్‌ను ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే 151వ మూవీ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో తెరకెక్కబోతుంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌చ‌రిత్ర‌గా ఈ మూవీ  తెర‌కెక్కుతోంది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ త‌న 152వ సినిమాను క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తాడు. చిరు 151వ సినిమా చిరు త‌న‌యుడు కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లోను.. 152వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఉండనుంది.

2018 లో ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి రిలీజ్ కానుంది. ఇక చిరు 153 కోసం అశ్వినీద‌త్.. 154 కోసం జెమిని కిర‌ణ్ సిద్ధంగా ఉన్నార‌ని చిరు ఇటీవ‌లే చెప్పాడు. ఈ నాలుగు సినిమాల‌తో చిరు వ‌చ్చే రెండేళ్ల‌లో ర‌ప్ఫాడించ‌డం పక్కాగా కనిపిస్తోంది. ఇక అశ్వ‌నీద‌త్ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

{youtube}v=WdCJovD0xYM{/youtube}

Related

  1. మహేష్ మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన మెగాస్టార్!
  2. అఖిల్‍కి బలవంతంగా పెళ్లి చేస్తున్న మెగా ఫ్యామిలీ
  3. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను సీఎం చేడానికి మెగాస్టార్ ప్లాన్స్ ఇవే!
  4. మెగాస్టార్ రికార్డును బద్దలు కొట్టిన పవర్ స్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -