Wednesday, May 15, 2024
- Advertisement -

నేను తనలాగే రెండో పెళ్లి చేసుకుంటా.. రేణూ దేశాయ్

- Advertisement -
Pawan Kalyan’s Ex Wife Renu Desai Reacts On Her Second Marriage

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై మాట్లాడారు. పవన్ – రేణూలు వైవాహిక బంధం నుంచి వేరుపడినప్పటికీ.. రేణు మాత్రం ఒంటరిగానే జీవిస్తుండగా, పవన్ కల్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇటివలే రేణు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

వాస్తవానికి, రెండో పెళ్లి గురించి చాలా గందరగోళానికి గురైనట్టు చెప్పారు. ఇదే అంశంపై ఓ కౌన్సిలర్ వద్దకు కూడా వెళ్లానని చెప్పింది. ఆమెకు తనలో ఉన్న భావాలన్నింటినీ చెప్పానని… దీంతో, మరో పెళ్లి చేసుకోవచ్చు కదా? అని సలహా ఇచ్చిందన్నారు. కానీ, తాను పవన్‌‍తో వైవాహికంగా, శారీరకంగా మాత్రమే విడిపోయినా అతనిపై తనకు ప్రేమ ఉందని చెప్పినట్టు తెలిపింది. ఒక వేళ రెండో పెళ్లి చేసుకున్నా తనకు తోడు మాత్రమే లభిస్తుందని… తన ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేనని రేణు చెప్పింది.

పెళ్లి చేసుకున్న వ్యక్తి తన పిల్లలకు సవతి తండ్రి అవుతాడే తప్ప తండ్రి కాలేడు కదా? అని ప్రశ్నించింది. రెండో పెళ్లిలో ఖచ్చితంగా ప్రేమ ఉండదని తేల్చి చెప్పింది. రెండో పెళ్లి పై తనకు కూడా ఆలోచనలు వస్తున్నాయని.. కాని కొన్ని భయాలు ఉన్నాయని తెలిపింది. రెండో పెళ్లి చేసుకున్నాక కూడా తొలిసారి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయేమోననే భయం వెంటాడుతుందని చెప్పింది. అలానే మళ్లీ ప్రేమలో పడతానో లేదో కూడా తెలియదు అని తెలిపింది. తనకు సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి విషయం స్వయంగా చెబుతానని రేణూ త్న మనసులో మాటను బయట పెట్టింది. 

{youtube}HIfCLCnaHUw{/youtube}

Related

  1. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!
  2. ఆ హీరోయిన్ కి దెబ్బ కొట్టిన పవన్‌, మహేష్‌!
  3. పవన్ కు విలన్ గా మారిన గోపిచంద్
  4. పవన్ అభిమానుల పై హరీష్ శంకర్ సంచలన ట్విట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -