Tuesday, April 30, 2024
- Advertisement -

కియారా అద్వానీ కిక్.. వైరల్ వీడియో!

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈ బ్యూటీ నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. సినిమాలలో ఎంతో బిజీగా ఉండే ఈమె కేవలం తన అందం పై మాత్రమే కాకుండా తన శరీర ఫిట్ నెస్ పై కూడా ఎంతో శ్రద్ధ వహిస్తారనే విషయం చాలా సందర్భాలలో స్పష్టమైంది.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు లేకపోవడంతో ఈ బ్యూటీ తన శరీర ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన వీడియో అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ వీడియోలో కియారా తన వర్కౌట్ ప్రాక్టీస్ లో భాగంగా కిక్ సెషన్స్‌ తెర లేపారు. బ్యాక్ కిక్ కొట్టే ఓ సాహసానికి కియారా ఉత్సాహం చూపారు. ఈ క్రమంలోనే తన పర్సనల్ ట్రైనింగ్ నిలబెట్టి తన తలపై టోపీ పెట్టి దానిని టార్గెట్ చేస్తూ కియారా బ్యాక్ కిక్ ప్రాక్టీస్ చేసింది. మొదటి రెండు సార్లు తన ప్రయత్నం ఫలించనప్పటికీ మూడోసారి తన తలపై ఉన్న టోపీని కాలితో కొట్టగా దెబ్బకి టోపీ గిరగిరా తిరిగి కింద పడింది.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

ఈ విధంగా బ్యాక్ కిక్ ద్వారా తన టార్గెట్ ను పూర్తి చేయడంతో ఎంతో సంబరపడిన కియారా ముందు నిలుచుకొన్న వ్యక్తి లలిత్‌కి హ్యాట్సాఫ్ ఇలా బ్యాక్ కిక్ కొట్టడం ఏడాదిన్నర అయింది. నా కిక్‌పై నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసింది. ప్రస్తుతం కియారా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలువురు నెటిజన్ల తోపాటు సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని లైక్ చేయడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -