బుల్లితెరపై తమన్నా.. ఏ షోకో తెలుసా?

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో సంపత్‌ నంది దర్శకత్వంలో “సీటీమార్‌”అనే సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తోంది. తమన్నా ఈ మూవీలో తెలంగాణ యాసతో డబ్బింగ్‌ చెప్పడం విశేషం. తర్వాత సూపర్ హిట్ హిందీ చిత్రం “అంధాధున్‌” తెలుగు రీమేక్‌ “మాస్ట్రో”లో అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న”ఎఫ్‌ 3″మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

హీరోయిన్ తమన్నా ఇటీవలె నటించిన వెబ్ సిరీస్ “నవంబరు స్టోరీస్‌” . తమన్నా ఈ వెబ్‌ సిరీలో అనురాధా గణేశన్‌ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగేప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “లెవన్త్‌ అవర్‌” అనే వెబ్ సిరీస్లో తమన్నా ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఆహా వేదికగా విడుదలై మంచి విజయం సాధించింది.

Also read:రష్మిక తల్లయ్యిందా.. అసలు నిజమేంటంటే?

తాజాగా తమన్నా ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ మాస్ట‌ర్ చెఫ్ త‌ర‌హా వంట కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయాల‌నుకుంటుంది. అందులో జ‌డ్జ్‌గా త‌మ‌న్నా క‌నిపించ‌నుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని తమన్నా అభిమానులు చెప్పుకుంటున్నారు.తమన్నా వెండితెరపై ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ, బుల్లి తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. వెండితెరపై అద్భుతంగా రాణించిన తమన్నా బుల్లితెరపై ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాలి మరి.

Also read:పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?