Thursday, May 2, 2024
- Advertisement -

మరోసారి పాట పడబోతున్న పవన్ కళ్యాణ్.. ఏ సినిమాకు అంటే?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోని ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తో గ్రాండ్ సక్సెస్ అందుకొని మరోసారి పవనిజం స్టామినా ఏంటో నిరూపించాడు.ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు భారీ బడ్జెట్ మూవీల్లో సందడి చేయనున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన” అయ్యప్పనుమ్ కోశియుమ్‌ ” తెలుగు రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రొడక్షన్ నెం:12 గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈమల్టీ స్టారర్ మూవీలో పవన్ పోలీస్ పాత్రలో నటిస్తుండగా, హీరో రానా హవాల్దార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.

Also read:అరియానతో ఆర్జీవీ హాట్ వర్కౌట్స్.. వామ్మో!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి సింగర్ గా మారి అద్భుతమైన ఫోక్ సాంగ్ పాడ బోతున్నాడట.పవన్ కళ్యాణ్ ఇదివరకే అత్తారింటికి దారేది మూవీలో పాడిన కాటమ రాయుడా.. కదిరీ నరసింహుడా… అనే ఫోక్ సాంగ్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో పవన్ పాడబోయే ఫోక్ సాంగ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి మరి.

Also reaad:నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటూ నటికి ప్రేపోజల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -