Thursday, May 2, 2024
- Advertisement -

హెచ్​సీఏలో అజహారుద్దీన్​ శకం ముగిసిట్టేనా?

- Advertisement -

హెచ్​సీఏలో గత కొంత కాలంగా సాగుతున్న వివాదాలు మరింత ముదిరాయి. హెచ్​సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్​పై వేటు పడింది. హెచ్​సీఏ సభ్యులతో చాలా కాలంగా ఆయన గొడవ సాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 2న అపెక్స్​ కౌన్సిల్​ ఆయనకు షోకాజ్​ నోటీసు ఇచ్చింది. నిన్న అజహారుద్దీన్​పై వేటు పడింది. గతంలో అజహారుద్దీన్​ టీం ఇండియా కెప్టెన్​గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన హెచ్​సీఏ అధ్యక్షుడైనప్పటి నుంచి అక్కడ వివాదాలు చుట్టుముట్టాయి.

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ సైతం అజహారుద్దీన్​పై పలు ఆరోపణలు చేశారు. ఆయన గతంలో మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడంటూ లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ విషయంపై తాను కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. తాజాగా అజహారుద్దీన్​ పై వేటు పడటం గమనార్హం.

అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో హెచ్​సీఏ సమావేశంలో అజహారుద్దీన్​.. విజయానంద్​ గొడవ పెట్టుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం హెచ్​సీఏలో జరుగుతున్న అవకతవకలపై స్పందించారు. హెచ్ సీఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అజహారుద్దీన్​ వ్యవహార శైలిపై మొదటి నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రతిభావంతులను పక్కకు పెడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఏ మాత్రం ప్రతిభ లేని వారికి అవకాశం ఇస్తున్నారని విమర్శలు వచ్చాయి. గతంలో అంబటి రాయుడు సహా పలువురు క్రికెటర్లు హెచ్​సీఏ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Also Read

ఈమెకు 23 మంది భర్తలు.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..!

హమ్మయ్య.. భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

జియాన్‌ఘాకా .. 39 మంది భార్యలకు భర్త.. ఇంకా చనిపోలేదట.. ఈ ట్విస్ట్ ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -