నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటూ నటికి ప్రేపోజల్!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలకు మాత్రమే కాకుండా హీరోయిన్ లకి కూడా వీరాభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోయిన్ కనబడితే వారితో ఎంచక్కా ఫోటో దిగాలని కొందరు భావించగా వారిని పెళ్లి చేసుకోవాలనుకొనే వారు మరికొందరు. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు హీరోయిన్లకు పెళ్లి ప్రపోజల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కి కూడా ఎదురయ్యింది.

నటి ప్రియ భవాని శంకర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న అభిమాని ఏకంగా తనను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈక్రమంలోనే తనకి ఏ విధంగా తన లవ్ ప్రపోజల్ గురించి తనకి చెప్పాలో తెలియక ఏకంగా సోషల్ మీడియా వేదికగా ప్రియ భవాని శంకర్ నే సూటిగా ప్రశ్నించాడు.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి అంటూ హీరోయిన్ ని అడిగాడు.

- Advertisement -

Also read:గతంలోకి వెళ్లిన రవితేజ.. క్రేజి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు?

ఈ విధంగా నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు నటి ప్రియా భవాని స్పందిస్తూ…”నాతో ప్రయాణం చేయాలంటే కొత్తవారికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలి అనే విషయం తెలియక పోవడమే చాలా మంచిదని ఈమె సమాధానం చెప్పారు.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఈమె ఆ తరువాత బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి సందడి చేశారు.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు రావడంతో వెండితెర పై పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో మంచు మనోజ్ సరసన అహంబ్రహ్మాస్మి సినిమాలో ప్రియ భవాని శంకర్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also read:ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -