Tuesday, April 30, 2024
- Advertisement -

నాన్నకు ఆ విషయం ఇంకా తెలీదు.. నిహారిక షాకింగ్ వీడియో!

- Advertisement -

మెగాహీరో నాగబాబు గారాల కూతురు నిహారిక తెలుగులో హీరోయిన్ గా ఇప్పటి వరకు “ఒక మనసు”, “హ్యాపీ వెడ్డింగ్” , “సూర్యకాంతం” వంటి సినిమాల్లో అద్భుతంగా నటించినప్పటికీ ఆశించినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. మెగా డాటర్ నిహారికకు జొన్నల గడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Also read:జవాన్స్ తో డ్యాన్స్ వేసిన అక్షయ్ కుమార్..?

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక తాజాగా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమోట్‌ చేసిన ఓ ప్రకటన వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఈ వీడియోలు తండ్రీ కూతుర్ల అనుబంధం గురించి చక్కగా వివరిస్తూ ఈ ప్రకటన సాగుతుంది. ఇందులో నిహారిక తండ్రి గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు. నటుడిగా ,రైటర్‌గా, నిర్మాతగా ఆయన నన్ను ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉన్నారు. జీవితంలో అన్ని పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్‌లైన్‌ ట్రాన్స్‌యాక్షన్‌ తప్పా అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వీడియో సాగుతుంది.

Also read:ఓటీటీలో విడుదల అయిన కొత్త చిత్రాలు ఇవే!

తరువాత ఈ వీడియోలో నాగబాబు ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సక్షన్ ఎలా చేయాలో తెలియక నిహారికను అడుగుతాడు.ఆమె చిరునవ్వుతో ఇప్పుడు డబ్బులు పంపడానికి అకౌంట్ డీటెయిల్స్ తో పనిలేదు. మన దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చాలు తక్షణం మనీ ట్రాన్స్ఫర్ చేసేయొచ్చు అంటూ ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి వీరిద్దరు ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

https://www.instagram.com/p/CQQP1eqpXZq/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -