Saturday, April 27, 2024
- Advertisement -

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూత

- Advertisement -

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. కరోనా వైరస్‌తో నెలరోజుల పోరాటం తర్వాత చండీగడ్‌లోని పిజిఐ ఆసుపత్రిలో మరణించారు. ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరొందిన.. భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మిల్కాసింగ్‌ మరణం తనను కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

కరోనాతో బాధపడుతూ మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్‌కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. 20 నవంబరు 1932లో పాకిస్థాన్ పంజాబ్‌లోని గోవింద్‌పూర్‌లో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు.

1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గొప్ప క్రీడాకారుని కోల్పోయామంటూ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మిల్కాసింగ్‌ ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారన్నారు.

ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో మంది ఇష్టపడ్డారన్నారు. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా, క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అమరిందర్‌ సింగ్‌ సైతం మిల్కాసింగ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన భార్య, భారత వాలీవాల్ మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ సైతం గతవారం కరోనాతో మృతి చెందారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -