Thursday, May 2, 2024
- Advertisement -

పవన్​కల్యాణ్​కు బండ్ల గణేశ్​ పెట్టిన పేరు ఇదే..!

- Advertisement -

నటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన బండ్ల గణేశ్​.. ప్రస్తుతం టాలీవుడ్​లో బడా నిర్మాతగా ఎదిగారు. ఇక ఆయనకు పవన్​ కల్యాణ్​ అంటే విపరీతమైన అభిమానం. ఆయనను ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్​ కల్యాణ్​ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇక బండ్ల గణేశ్​ పొలిటికల్​ ఎంట్రీ కూడా ఇచ్చాడు. గత ఏడాది కాంగ్రెస్​లో చేరారు. కానీ ఎందుకో రాజకీయాలు అంతగా కలిసిరాలేదు. ఇంటర్వ్యూలు, టీవీ డిబేట్లు అతడి కొంప ముంచాయి. పాలిటిక్స్​లో ఓ కమెడియన్​గా మారిపోయాడు బండ్ల గణేశ్​.

కేఏ పాల్​ సరసన చేరిపోయాడు. అందుకే ఆయన రాజకీయాలను వదిలేసారు. ఇక అప్పుడప్పుడు వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన ప్రకటనలతో నిత్యం మీడియా లో నానూతూ ఉంటారు. ప్రస్తుతం మా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఆయన ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున పోటీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్​ కల్యాణ్​ను స్తుతిస్తూ ఓ ట్వీట్​ చేశాడు బండ్ల గణేశ్​.. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్​గా మారింది.

ఇంతకీ ఏమన్నాడంటే.. ‘ భక్త కన్నప్ప.. పరమేశ్వరుడిని దేవర అని పిలుచుకునేవారు నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని దేవర అని పిలుస్తాను’ అంటూ ట్వీట్​ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​గా మారింది. హీరోలను ఆకాశానికిఎత్తేడం వారిని దైవాంశ సంభూతులుగా కొలవడం సినీ పరిశ్రమలో కామనే. నిర్మాతలకు అది అవసరం కూడా. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్​.. పవన్​ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకొనేందుకు ఇటువంటి ట్వీట్​ పెట్టాడన్నమాట. వకీల్​ సాబ్​ ఫంక్షన్​లోనూ పవన్​కల్యాణ్​ను ఆకాశానికి ఎత్తేశాడు బండ్ల గణేశ్​.

Also Read

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -