Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్ సినిమా నుంచి మరో అప్డేట్.. ఈసారి హరిహర వీరమల్లు నుంచి..!

- Advertisement -

రాజకీయాలకు స్వల్ప విరామం ఇచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట ఆయన హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయ్యాయి. ఈ గ్లింప్స్ వచ్చీరాగానే రికార్డుల వేట మొదలు పెట్టాయి. రెండు రోజులుగా ఈ మూవీ గ్లింప్స్ సృష్టిస్తున్న సంచలనంతో యూట్యూబ్ లో రికార్డులు షేక్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డులను పవన్ కళ్యాణ్ ఊచ కోత
కోస్తున్నాడు.

కాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రారంభించాడు. అయితే ఈ సినిమానే మొదట విడుదల అవుతుందని అంతా భావించారు. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా షూటింగ్ కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుందని భావించిన పవన్ కళ్యాణ్ ముందుగా భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు.

ఈ మూవీ గ్లింప్స్ తాజాగా విడుదల కావడంతో ప్రస్తుతం అభిమానుల్లో ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ పేరు మారు మోగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకంటే ముందే మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా నుంచి కొద్దిరోజులుగా ఎటువంటి అప్డేట్ లేకపోవడం, సినిమా షూటింగ్ కూడా ఆపివేయడంతో ఇంతకు ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా.. లేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

హరిహర వీరమల్లు సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ విడుదల చేయాలని కొద్దిరోజులుగా అభిమానులు కోరుతున్నారు. వారు కోరుకున్నట్లుగానే ఇవాళ హరిహర వీరమల్లు నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నిధి చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. కాగా పవన్ సినిమాలకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు వస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: మరో రీమేక్ పట్టిన వెంకీ.. అచ్చొచ్చిన దర్శకుడికే అవకాశం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -