మరో రీమేక్ పట్టిన వెంకీ.. అచ్చొచ్చిన దర్శకుడికే అవకాశం..!

- Advertisement -

విక్టరీ వెంకటేష్ కెరీర్లో విజయాల శాతం ఎక్కువే. అందుకే ఆయనను విక్టరీ వెంకటేష్ అని పిలుస్తారు. ఇప్పటివరకు వెంకటేష్ 70కి పైగా సినిమాల్లో నటించగా అందులో రీమేక్ లు కూడా భారీగానే ఉన్నాయి. వెంకటేష్ రీమేక్ చేసిన ప్రతి సారి సరైన ఫలితమే దక్కింది. ఇటీవలి కాలంలో వెంకటేష్ నుంచి వచ్చిన దృశ్యం, నారప్ప సినిమాలు కూడా రీమేక్. ఇప్పుడు వెంకటేష్ మరోసారి రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.

మలయాళంలో రెండేళ్ల కిందట విడుదలైన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ సంచలన విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పలువురు హీరోలు కూడా ప్రయత్నాలు చేశారు. ఎందుకో సెట్ అవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి వెంకీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి.

డైరెక్ట్ గా తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ కాగా.. తాజాగా తమిళ అసురన్ రీమేక్ నారప్ప కూడా విజయం సాధించింది.దీంతో మరోసారి రీమేక్ బాధ్యతలు శ్రీకాంత్ అడ్డాల కు వెంకటేష్ అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ దృశ్యం-2 రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ -3 అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయమై అఫీసియల్ గా ప్రకటన రావాల్సింది ఉంది.

Also Read: చిరు రెండు సినిమాల అప్డేట్లు పక్కా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -