పెళ్లిసందD సినిమాతో తెరుతెరకు పరిచమైన చిన్నది శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిందీ ఈ చిత్రం. మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. దాంతో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ ధమఖా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీలో క్రేజీ ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, శ్రీలీలని ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా ప్రచారం నడుస్తోంది.
మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామని అనుకుంటున్నారట..హోలీ సందర్భంగా మార్చి 18న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన ప్రియామణి