Monday, May 6, 2024
- Advertisement -

ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న రామ్ చ‌ర‌ణ్

- Advertisement -

మెగా హీరో చెర్రీ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన భారీ బ‌డ్జెట్, పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లు మార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎట్ట‌కేల‌కు ఫిక్స్ అయింది. అటు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌రణ్ మ‌రో క్రేజీ ప్రాజెక్టులోనూ న‌టిస్తున్నాడు.

ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లోనూ హీరోలందరూ వెబ్‌సిరీస్‌ల వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ కూడా అదే బాటలో పయనించనున్నారట. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించే వెబ్‌సిరీస్‌లో చరణ్‌ నటించనున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన ఓ పాపులర్‌ వెబ్‌సిరీస్‌ను చరణ్‌ కోసం రీమేక్‌ చేస్తున్నారట.

భారతీయ నేటివిటీకి అనుగుణంగా ఆ సిరీస్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై చరణ్‌తో సంప్రదింపులు జరిపారని, అందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌ డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఓటీటీలోనూ రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో మెగా అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది.

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

అంతా అయిపోయిందన్న సంచలనాల నటి

వివాదంలో రవితేజ చిత్రం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -