Friday, May 3, 2024
- Advertisement -

జోరుమీద ఉన్న చిన్న సినిమాలు

- Advertisement -

సినీ అభిమానుల‌కు గుడ్ న్యూస్. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ చాలా సినిమాలు ఇప్పుడు విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్నాయి. సంక్రాంతికే కొన్ని సినిమాలు విడుద‌ల కాగా.. ప్ర‌స్తుతం మ‌రిన్ని చిత్రాలు విడుద‌ల‌కు క్యూ క‌డుతున్నాయి. కొవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో చిన్న సినిమాల జోరు పెరిగింది. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. మార్చిలో కొన్ని భారీ చిత్రాల విడుద‌ల‌కు ముహూర్తం ఫిక్స్ కావ‌డంతో చిన్న సినిమాలు అన్నింటినీ ఫిబ్రవరిలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఇక వచ్చే ఈ నెల 18వ తేదీన శుక్రవారం మొత్తం 10 సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ కానున్నాయి. ఇందులో మోహన్ బాబు మూవీ సన్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ సహిదేవ్ వర్జిన్ స్టోరీ ఫిబ్రవరి 18న రిలీజ్‌ కానుంది. సన్ ఆఫ్ ఇండియా, వర్జిన్ స్టోరీ మినహా మిగిలినవన్నీ చిన్న సినిమాలే.

2020 గోల్ మాల్, సురభి 70 ఎం.ఎం, విశ్వక్, రోమన్‌తో పాటు నీకు నాకు పెళ్ళంట మూవీలు ఈ వీకెండ్‌లో రిలీజ్‌ కానున్నాయి. గత వారమే రిలీజ్‌ కావాల్సినటువంటి బ్యాచ్ 1 మూవీ కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది. అలాగే ఇంగ్లీష్​ డబ్బింగ్ మూవీ అన్ చార్టెడ్‌తో పాటు కన్నడ డబ్బింగ్ చిత్రం బడవ రాస్కెల్ మూవీలు కూడా రిలీజ్‌ కానున్నాయి. దాదాపు 10 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

దీపికా సినిమాపై కంగనా ఫైర్

రెండు గెటప్‌లలో రామ్‌చరణ్

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -