Monday, May 6, 2024
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు మ‌రోసారి నిరాశే

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ అభిమానుల‌కు మ‌రోసారి నిరాశ త‌ప్పేలా లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ విడుద‌ల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి మ‌రి కొన్ని రోజుల నిరీక్ష‌ణ త‌ప్ప‌ద‌నిపిస్తోంది. సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల రిలీజ్ వాయిదా ప‌డింది. అయితే ఆ త‌ర్వాత ఫిబ్రవరిలో విడుదలను ఖరారు చేసుకున్నా… భీమ్లా నాయక్ ఇప్ప‌డు మ‌రోసారి వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ డ్రామా ‘అయ్యపనుమ్ కోషియుమ్’ను తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో పవన్‌తో పాటు రానా కూడా హీరోగా నటిస్తున్నాడు. సంయుక్త మీనన్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25న విడుదల చేయాల‌ని భావించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఫిబ్రవరి 15 దాటితే ఇంకా ఏ వారంలోనూ భీమ్లా నాయక్ విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం ఏదో ఒక పాన్ ఇండియా సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధ‌మ‌వుతోంది. అందుకే భీమ్లా నాయక్ ఏప్రిల్ 1న విడుదల కానున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘గని’ సినిమా ఫిబ్రవరి 25న విడుదలను ఖరారు చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే భీమ్లా నాయక్ పోస్ట్‌పోన్ అయినట్టే అనుకుంటున్నారు పవన్ అభిమానులు.

భారీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న శ్రీలీల‌

రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేసిన ప్రియామ‌ణి

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -