Tuesday, April 30, 2024
- Advertisement -

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో నటి సమంతకు ఉన్న మంచి స్నేహితురాళ్లలో దర్శకురాలు నందినిరెడ్డి ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ రెండు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్, ఓ బేబీ మూవీస్ చేశారు. జబర్దస్త్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఓ బేబీ మాత్రం ఇద్దరికీ మంచి హిట్ ఇచ్చింది. దీంతో సమంతతో కలిసి మరో సినిమా తీయాలని నందిని రెడ్డి భావించారు. అయితే వరుస సినిమాలతో సమంత బిజీ కావడం.. నాగచైతన్యతో విడిపోవడం జరిగిపోయాయి. దీంతో ఆ సినిమాకు వెంటనే మొదలు కాలేదు.

అయితే ఇప్పటికీ సమంత, నందినిరెడ్డి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగచైతన్య, సమంతలను మళ్లీ కలపాలని నందిని రెడ్డి ప్రయత్నిస్తోంది. అయితే అది నిజజీవతంలో కాదు.. వారిద్దరినీ ఓ సినిమాతో కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగచైతన్యతో నందినిరెడ్డి త్వరలో ఓ సినిమా తీయబోతున్నారు. ఇందు కోసం చాలా మంది పేర్లను పరిశీలించారు. చివరుకు సమంత అయితే బాగుంటుందని భావించారు.

అయితే నాగచైతన్యతో సమంత కలిసి నటించేందుకు ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్న. పెళ్లి కాకముదు చైతూ, సామ్ కలిసి ‘ఏమాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం’ సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లయ్యాకా వారిద్దరు కలిసి చేసినది మజిలి. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తారా .. అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంతను ఒప్పించేందుకు నందిత ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అవే సఫలమైతే.. అభిమానులకు పండుగే.

ఆ వ్యక్తిపై ఫైర్ అయిన అనసూయ

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -