ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

- Advertisement -

సంచలనాలకు మారుపేరుగా మారారు దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ రేంజ్ కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. బ్లాక్ బాస్టర్ సినిమాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజమౌళి తాజా సంచలనం ట్రిపుల్ ఆర్. బాహుబలి సినిమాతో భారత చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామచరణ్ నటిస్తుండటంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇలాంటి సినిమాను ఏ స్థాయి బడ్జెట్తో నిర్మించి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాను దాదాపు 500 కోట్లతో నిర్మించినట్లు సమచారం. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకు రాజమౌళి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.

- Advertisement -

ట్రిపుల్ ఆర్ లాభాల్లో 30 శాతం రాజమౌళి తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన రెమ్యునరేషన్ కింద రూ.80 కోట్లు తీసుకున్నారట. ఒక సినిమాకు దర్శకుడు ఇంత పారితోషకం తీసుకోవడం సంచలనమే చెప్పాలి. భారత సినీ పరిశ్రమలో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న దర్శకుడు రాజమౌళీనేనట.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -