Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రమాణస్వీకారానికి కొందరు డుమ్మా

- Advertisement -

వైసీపీలో కేబినెట్ మంటలు తగ్గడం లేదు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలు రాజీనామాలకు సైతం వెనకాడటం లేదు. సీనియర్ నేతలు బుజ్జగించినా..అలక వీడినట్లు కనిపించడం లేదు. చాలా చోట్ల వారి అనుచరులు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రులు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారి అనుచరులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలినేని బుజ్జగించేందుకు సజ్జల రంగంలోకి దిగినా..పరిస్థితి చక్కబడలేదు. దాంతో సీఎం జగన్ రంగంలోకి దిగారు. బాలినేనిని తన దగ్గరకు పిలిపించుకుని దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.

ఈ సందర్భంగా బాలినేని కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. మరోవైపు సుచరిత ఇంటికి ఎంపీ మోపిదేవి వెళ్లారు. ఆయనను ఆమె అనుచరులు అడ్డుకున్నారు. మోపిదేవికి రాజీనామా లేఖను ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వెలగపూడిలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు డుమ్మ కొట్టారు. వారి వారి క్యాంప్‌ కార్యాలయాల్లోనే ఉండిపోయారు. భవిష్యత్‌ కార్యచరణపై అనుచరులతో చర్చిస్తున్నారు. పార్టీ కోసం పని చేసినా ఫలితం లేదన్న భావన కొందరి నేతల్లో కనిపిస్తోంది. కుల సమీకరణాల ప్రకారం తమకే పదవులు దక్కాలంటున్నారు.

వైసీపీలో అసంతృప్తి జ్వాలలు తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఇటు సీనియర్ వైసీపీ నేతలు చెబుతున్నారు. సామాజిక న్యాయంతో అన్ని వర్గాలకు పెద్దపీట వేశామంటున్నారు. సీఎం జగన్‌ స్వయంగా కేబినెట్‌ కూర్పు చేశారని..దీనిని అందరూ స్వాగతించాలంటున్నారు. వైసీపీలో మొదలైన కేబినెట్ రచ్చ ఎక్కడా దాక వెళ్తుందో చూడాలి.

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

ఏపీలో కొలువుతీరిన కొత్త కేబినెట్.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -