Monday, April 29, 2024
- Advertisement -

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

- Advertisement -

యాసంగి వరిని కేంద్రమే కొనాలంటూ ఒక పక్క ఢిల్లీలో టీఆర్ఎస్‌ ఆందోళనలు చేపడితే.. మరోవైపు గులాబీ పార్టీకి పోటీగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో దీక్షకు దిగారు. వరి కొనుగోలు విషయం రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ నేతలు ఎండగట్టారు. వడ్లు కొంటామని కేంద్రం పదే పదే చెబుతున్నా ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదంటూ నిలదీశారు. వడ్లు కొను లేదా గద్దె దిగు అనే నినాదంలో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర రైతు దీక్ష చేపట్టింది. కేంద్ర మంత్రి వి. మురళీధరన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ బీజేఎల్పీ నేత రాజా సింగ్ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరలు ఈ దీక్షలో పాల్గొని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌కు వేరు రాష్ట్రాలకు తిరగడానికి డబ్బులు ఉన్నాయి కానీ రైతుల నుంచి వడ్లు కొనడానికి లేవా అని కేంద్ర మంత్రి మురళీధరన్ ప్రశ్నించారు. కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కాదనీ చీఫ్ మిస్ లీడర్ అని విమర్శించారు. కేసీఆర్‌ను కమిషన్‌ రావు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు పాకిస్థాన్‌పై ఉన్న నమ్మకం మనపై లేదన్నారు. మిల్లర్లతో టీఆర్‌ఎస్ నేతలకు ఒప్పందం ఉందని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిరసనల పేరుతో సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. వడ్డు కొంటామని కేంద్రం పదే పదే చెబుతున్నా ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందనీ.. కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికే ఢిల్లీలో దీక్ష పేరిట డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల దగ్గరే రైతులు చస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విజయశాంతి దుయ్యపట్టారు.

కొనుగోలు కేంద్రాలను రాష్ట్రప్రభుత్వం ఎందుకు మూసేసిందని ప్రశ్నించారు. కేంద్రం తలుచుకుంటే కేసీఆర్‌ను జైలుకు పంపించడానికి ఎంతో సమయం పట్టదని ఎంపీ అరవింద్ అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగిస్తోందన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో ఏ రాష్ట్రానికి రాని సమస్య తెలంగాణకే ఎందుకు వస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు ప్రశ్నించారు. కావాలనే టీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రైతులను దగా చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. మొత్తమ్మీద అటు ఢిల్లీలో టీఆర్ఎస్.. ఇటు హైదరాబాద్‌లో బీజేపీ ధర్నాలతో వడ్లు కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.

అలకబూనిన అధికార పార్టీ నేతలు

వైసీపీలో అసంతృప్తి సెగలు

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -