Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో కొలువుతీరిన కొత్త కేబినెట్.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే ?

- Advertisement -

ఏపీలో కొత్త కేబినెట్ కొలువు తీరింది. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు జగన్ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. గతంలో లాగే ఈ సారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టింది. హోంశాఖను రోజాకు కేటాయిస్తారంటూ ప్రచారం జరిగినా.. చివరకు అనూహ్యంగా తానేటి వనితకు కేటాయించారు. గత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన కడపకు చెందిన అంజాద్ బాషకు ఈ సారి కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. అంతే కాకుండా గతంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖను కూడా ఆయనకే కేటాయించారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు రాజన్న దొరకు గిరిజన సంక్షేమ శాఖ , మరో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను ఇచ్చారు.

ఇక ఇంకో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు దేవాదాయశాఖ, నారాయణస్వామికి ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఈ సారి కూడా అవే బాధ్యతలు అప్పగించారు. కొత్త పీఆర్సీపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో విద్యా శాఖను తాజాగా బొత్స సత్యనారాయణకు అప్పగించారు. గతంలో ఈ శాఖను చేపట్టిన ఆదిమూలపు సురేష్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కేటాయించారు. ఈ సారి హోంశాఖ నగరి ఎమ్మెల్యే రోజాకు దక్కుతుందని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా ఆ శాఖను తానేటి వనితకు అప్పగించారు. గతంలో హోంశాఖ మంత్రిగా మేకతోటి సుచరిత పని చేశారు. ఈ సారి సుచరితకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించలేదు.

మరోవైపు రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు. ఆళ్లనాని గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేస్తే.. ఇప్పుడా శాఖను విడదల రజనీకి కేటాయించారు. కొడాలి నాని నుంచి పౌర సరఫరాల బాధ్యతలను తప్పించిన సీఎం.. ఈ సారి కారుమూరి నాగేశ్వరరావుకు ఆ శాఖను కేటాయించారు. వ్యవసాయ శాఖ బాధ్యతలను కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పగించారు. గతంలో ఈ శాఖ మంత్రిగా కురసార కన్నబాబు పని చేశారు. ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించగా..గుడివాడ అమర్నాథ్‌కు పరిశ్రమల శాఖ, అంబటి రాంఆబుకు జల వనరుల శాఖ దక్కింది.

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -