Sunday, April 28, 2024
- Advertisement -

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

- Advertisement -

వరి కొనుగోళ్లపై కేంద్రంపై పోరాటం చేస్తున్న టీఆర్ఎస్.. ఢిల్లీ వేదికగా గర్జించింది. తెలంగాణ భవన్ వేదికగా ధర్నా చేశారు గులాబీ లీడర్లు. ఢిల్లీ వేదికగా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి అల్టీమేటం ఇచ్చారు సీఎం కేసీఆర్‌ . 24 గంటల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే భూకంపం స్పష్టిస్తామన్నారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలంటూ కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్.. ఢిల్లీలో ధర్నాకు దిగింది. తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా జరిగిన నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ధాన్యం కేంద్రం కొనాలంటూ నినదించారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిల‌దీశారు. తెలంగాణ రైతుల‌ను, మంత్రుల‌ను పీయూష్ గోయ‌ల్‌ అవ‌హేళ‌న చేశార‌ని కేసీఆర్ మండిపడ్డారు.తెలంగాణ అన్న‌దాత‌లు నూక‌లు తినాల‌ని చెబుతురా… మేమైనా గోయ‌ల్ వ‌ద్ద అడుక్కోవ‌డానికి వ‌చ్చామా? అంటూ నిలదీశారు.పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అంటూ మండిపడ్డారు. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుప‌డ‌లేగన్నారు.

ధాన్యం సేక‌ర‌ణ‌కు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు రైతు సంఘం నాయకులు రాకేష్‌ టికాయత్‌. దేశంలో అసలు ఏం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేస్తున్న‌ది రాజ‌కీయ ఉద్య‌మం కాదు అని టికాయత్ వ్యాఖ్యానించారు.

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఖరారు

కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం

మరోసారి ఏచూరికే ఛాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -