బాహుబలి మూవీలో ప్రభాస్, అనుష్క ఎలాంటి నటన కనబర్చారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. రీల్ లైఫ్లో తనదైన శైలిలో కెమిస్ట్రీ పండిస్తున్న ఈ ఇద్దరూ.. రియల్ లైఫ్లో కూడా పండిస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్లో వీరిద్దరూ ప్రేమలో పడ్డట్టు బాహుబలి ప్రమోషన్స్ చూస్తే అర్ధం అవుతోంది. ప్రభాస్ బయట ఎప్పుడు హీరోయిన్ ని ఆటపట్టించిన దాఖలాలు బయట పడలేదు.
ఇప్పుడు కూడా తమన్నా విషయంలో అలాగే ప్రవర్తించాడు. అయితే అనుష్క విషయంలో మాత్రం ప్రభాస్ భిన్నంగా ఉన్నాడు.. బిల్లా సినిమాలో అనుష్క వేసుకున్న బికినీ గురించి వీరిద్దరూ మాట్లాడుకునే అంతా చనువ ఏర్పడినట్లు కనపడుతుంది. ఈ మధ్య జరిగిన బాహుబలి ప్రమోషన్స్ లో కూడా అనుష్క ప్రభాస్ మధ్య ఉన్న ప్రేమ సన్నిహితంగా కనపడింది. అయితే ప్రభాస్ పైన నవ్వుతూ అతనిపై పడిన పువ్వులను ముసిముసి నవ్వులతో సిగ్గుతో అనుష్క ప్రేమగా వాటిని తీసెయ్యడం చూసి అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.
అలాగే అనుష్క ఫోన్ తీసుకోని ప్రభాస్ బ్రౌజ్ చెయ్యడం మనమందరం చూసాం. అయితే విరిద్దరిపైన వచ్చిన రూమర్స్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా లేక బాహుబలి తరువాత ఎవరి సినిమాలో వారు బిజీ గా ఉంటారా అనేది తెలియాల్సిన విషయం. కానీ వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంతుందని రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా.. చిలక.. గోరింకల్లా కలిసి ఉండాలని ప్రేక్షకుల కోరిక. మరి ఆ కోరికని ప్రభాస్ అనుష్క తీరుస్తారో లేదో చూడాలి.
Related