Thursday, May 16, 2024
- Advertisement -

పాపం.. ప్రభాస్‌కు ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి

- Advertisement -
rajamouli shock to prabhas about saaho film

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి రెండో బాగం ఇంకో వారం రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ప్రభాస్ సాహో అనే మూవీలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నెల 23న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు.

బాహుబలి 2 రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో కూడా సాహో టీజర్ ను రిలీజ్ చేయాలని భావించారు. అయితే అందుకు బాహుబలి టీం ఒప్పుకోలేదని సమాచారం. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు.. బాహుబలి 2 రిలీజ్ సమయంలో సాహో గురించిన చర్చ ప్రేక్షకుల్లో మంచిది, మొత్తం అంతా కూడా బాహుబలి గురించే మాట్లాడుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని రాజమౌళి భావించాడు.

అందుకే ప్రభాస్ కు తర్వాత సినిమా ఫస్ట్ లుక్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రభాస్ మరియు అతడి నిర్మాతలు సాహో ఫస్ట్ లుక్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బాహుబలి తో పాటు సాహో రిలీజైతే దేశ వ్యాప్తంగా ప్రభాస్ తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు ఆ సినిమా కి క్రేజ్ దక్కుతుంది. కానీ రాజమౌళి అడ్డు చెప్పడంతో ప్రభాస్ కు నిరాశే మిగిలింది.

{youtube}YsPZtrSM0es{/youtube}

Related

  1. ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?
  2. ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?
  3. ప్రభాస్‌ను చూసి భయపడ్డ చిరంజీవి
  4. ప్రభాస్‌ పెళ్లి విషయంపై ఇప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -