- Advertisement -

” బాద్ షా ” రీ రిలీజ్ ఈసారైనా బాక్స్ ఆఫీస్ షేక్ అవుద్దా ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన బాద్ షా కమర్షియల్ గా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికి కలెక్షన్స్ పరంగా చెప్పుకోదగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. 2013 లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో మంచి కామిడీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలోని బ్రహ్మానందం కామిడీ సీన్స్ కు ఇప్పటికీ కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక టీవి లో ఈ మూవీ ఎప్పుడు వచ్చిన అద్భుతమైన టి‌ఆర్‌పి రేటింగ్ తెచ్చుకోవడం విశేషం.

ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ సినిమాకి మయిన్ హైలెట్. అలాగే మూవీ లో యంగ్ టైగర్ కామిడీ టైమింగ్ కూడా మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ మూవీని తాజాగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత నట్టి కుమార్ ప్రకటించారు. నవంబర్ 19న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ” బాద్ షా ” మూవీని మళ్ళీ థియేటర్ లో చూసేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకుంది. స్టార్ హీరోల హిట్ మూవీస్ అన్నీ ఒక్కొక్కటి గా వారి రిలీజ్ చేస్తూ వారి అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. ఆ మద్య మహేశ్ బాబు బర్త్ డే కానుకగా ” పోకిరి, ఒక్కడు ” మూవీస్ ను రీరిలీజ్ చేయగా కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా ” జల్సా ” మూవీని రీ రిలీజ్ చేయగా ఆ మూవీ కూడా అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ఇక ఇటీవల ప్రభాస్ ” బిల్లా ” మూవీని కూడా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ ” బాద్ షా ” మూవీ రీ రిలీజ్ చేస్తుండడంతో ఈ మూవీ రీ రిలీజ్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిరు కోసం స్టార్ హీరోలు ?

విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలే.. రెండు భారీ ప్రాజెక్టులు !

అవతార్ 2 రిలీజ్ డేట్ పై కన్నేసిన అల్లు అర్జున్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -