Wednesday, May 1, 2024
- Advertisement -

మొబైల్ ఫ్యాంట్ జోబిలో పెడుతున్నారా.. జాగ్రత్త !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మొబైల్ తోనే కాలక్షేపం చేస్తూ ఉంటాము. అయితే మొబైల్ వల్ల ఉపయోగం ఏ స్థాయిలో ఉందో అంతకు రెండు రేట్లు నష్టం కూడా ఉండని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ యూస్ చేసే పురుషులు చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పురుషులు మొబైల్ ను చాలా వరకు ఫ్యాంట్ పాకెట్ లో ఉంచుకుంటారు, అలా ఉంచుకోవడం తీవ్ర అనర్తలకు దారి తీస్తుందట. ముఖ్యంగా పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అవుతుందట.

ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ను ఫ్యాంట్ జోబిలో పెట్టుకోవడం వల్ల మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మగవారి లోని వీర్యకణాలపై ప్రభావం చూపడంతో, వాటి చలనం లోనూ, నిర్మాణం లోనూ చాలానే మార్పులు వస్తాయని, ఫలితంగా సంతనలేమీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైధ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా ” టాక్సిక్ లేదా రియాక్టివ్ ” ఆక్సిజన్ జాతుల ఉత్పత్తిలో మార్పులు సంభవించి వీర్య కణాలు చాలా డ్యామేజ్ కు గురి అవుతాయట. కాబట్టి మొబైల్ ను ఫ్యాంట్ జోబిలో పెట్టడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొబైల్ సూట్ జోబిలో గాని లేదా బెల్ట్ దగ్గర సైడ్ కు ఒక ప్రత్యేక మొబైల్ పౌచ్ గాని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే మొబైల్ రేడియేషన్ నుంచి వచ్చే సమస్యలను చాలా వరకు చెక్ పెట్టె అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక మొబైల్ లో రేడియేషన్ కు సంబంధించిన సర్ వ్యాల్యూ 1.6w / kg ఉండాలని అంతకు మించి ఎక్కువ ఉంటే ఆ మొబైల్ ను యూస్ చేయకూడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ లోని సర్ వ్యాల్యూ తెలుసుకోవడానికి *#07# అనే కోడ్ ఎంటర్ చేస్తే మొబైల్ కు సంబంధించిన సర్ వ్యాల్యూ తెలుస్తోంది. కాబట్టి మొబైల్ ను ఫ్యాంట్ జోబిలో పెట్టుకోవడం చాలా వరకు అవైడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే.. అంతే సంగతులు !

పాత మొబైల్ లోని డేటా.. కొత్త మొబైల్ లో పొందండిలా !

మీ మొబైల్ పోయిన వెంటనే.. తప్పక చేయవలసిన పనులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -