అవతార్ 2 రిలీజ్ డేట్ పై కన్నేసిన అల్లు అర్జున్ ?

Pushpa Star Allu Arjun Focus on Avatar 2 Release Date
Pushpa Star Allu Arjun Focus on Avatar 2 Release Date

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 “. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ..గత ఏడాది వచ్చిన ” పుష్ప పార్ట్ 1 ” కి కొనసాగింపుగా రూపొందుతున్న్జ విషయం తెలిసిందే. మొదటి భాగం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హిందీలో కళ్ళు చెదిరే కలెక్షన్స్ ను రాబట్టింది. దీంతో పుష్ప పార్ట్ 2 కోసం ఇండియా మొత్తంలో వెయిటింగ్ నడుస్తోంది. ఇక పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికీ మూవీకి సంబంధించిన ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇక త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందట. ఇదిలా ఉంచితే మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే టిజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టిజర్ కు అవసరమయ్యే కొన్ని షాట్స్ ను ముందే షూట్ చేసి డిసెంబర్ లోనే టిజర్ రిలీజ్ చేస్తారట. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ” అవతార్ 2 ” రిలీజ్ రోజునే పుష్ప పార్ట్ 2 టిజర్ కు రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవతార్ రిలీజ్ అయ్యే థియేటర్లలో పుష్ప పార్ట్ 2 టిజర్ ప్రదర్శితం అవుతుందట. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.