Tuesday, April 30, 2024
- Advertisement -

వాల్తేరు వీరయ్య కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు !

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ” వాల్తేరు వీరయ్య “. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో మెగాస్టార్ ఊర మాస్ గా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు లోని ఒకప్పటి మాస్ యాంగిల్ ను ఈ మూవీతో మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు డైరెక్టర్ బాబీ. అందుకే మూవీ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా పక్కా ప్రణాళిక బద్దంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. .

ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్రలో స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఇక ఈ మూవీలో మరో అతిథి పాత్రకు కూడా అవకాశం ఉందట. ఆ పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరుపుతోందట చిత్రాయునిట్. అయితే ఈ మూవీలో మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ ఎక్స్ 100 మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాధించుకున్న కార్తికేయ.. ఈ మూవీలో ఓ కీ రోల్ లో కనిపించనున్నాడట. కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి కీ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.

అందుకే మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో కార్తికేయ చిరు మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికి.. ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి ” ఖైదీ నెంబర్ 150 ” తరువాత చిరు ఇమేజ్ కు తగినట్లుగా ఒక్క హిట్ కూడా లేదు. ఈ మద్య వచ్చిన గాడ్ ఫాదర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో మెగాస్టార్ అభిమానుల ఆశాలన్నీ వాల్తేరు వీరయ్య మూవీ పైనే ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

ఇంటర్వ్యూ లో కన్నీరు పెట్టిన సమంత.. కారణం అదే !

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -