మోడీతో మీటింగ్.. బాబు తో డేటింగ్ పవన్ పై సెటైర్స్ !

Social Media Satires on Pawan Kalyan
Social Media Satires on Pawan Kalyan

ప్రధాని నరేంద్ర మోడీ రెండు తెలుగురాష్ట్రాల పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముందుగా ఏపీలో పర్యటించిన మోడీ.. విశాఖ పట్నంలో రూ.10,742 కోట్ల వ్యయంతో పలు కొత్త ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేశారు. ఇక ఏపీ ప్రజలు కష్టపడే తత్వం కల్గిన వారని, విశాఖపట్నం ఎంతో అందమైన నగరం అని మోడీ చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంచితే మోడీ విశాఖపట్నం వచ్చిన తరువాత మొదటగా జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. ఈ బేటీ అధికార వైసీపీ నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఎందుకటే ప్రధాని పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హంగామా.. బీజేపీ పార్టీ కూడా చేయలేదనే చెప్పవచ్చు.

కానీ మోడీ మాత్రం ముందుగా పవన్ కు ప్రదాన్యత ఇవ్వడంతో వైసీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక పవన్ మోడీ బేటీకి సంబంధించి. వైసీపీ నేతలు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీతో మీటింగు.. బాబుతో డేటింగు అంటూ పవన్ ను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ లో వ్యంగ్యస్త్రాలు సంధించారు.మోడీతో బాబుకు సయోద్య కుదిరించేందుకే పవన్ ప్రయత్నం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మోడీతో బేటీ అనంతరం చర్చించిన అంశాల గురించి పవన్ ఏమన్నారంటే.. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ప్రధానితో బేటీ అయ్యనాని, ఈ సమావేశంలో ఆంద్రప్రదేశ్ కు సంబంధించిన కొన్ని అంశాలను ప్రధాని అడిగారాని పవన్ చెప్పుకొచ్చారు.

భవిష్యత్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయని, ఈ మీటింగ్ అందుకు దోహసం చేస్తుందని పవన్ అన్నారు. అయితే ఆయన త్రిముఖ పొత్తు విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ బేటిలో టిడిపి, బిజెపి, జనసేన పొత్తు గురించిన ప్రస్తావన కచ్చితంగా చర్చకు వచ్చి ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ త్రిముఖ పొత్తు విషయం చర్చకు మోడీ ఎలాంటి సూచనలు చేశారు. అసలు బిజెపి, టీడీపీ తో కలిసేందుకు ఎంతవరకు సిద్దంగా ఉంది ? వీటన్నిటిపై ప్రధాని.. పవన్ కు ఎలాంటి షరతులు విధించారు అనే వాటిపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి.. పవన్ మోడీ సమావేశం.. వైసీపీ వర్గాలను మాత్రం కునుకు లేకుండా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ కు మోడి వార్నింగ్ లు ?

పవన్ దారిలో లోకేష్.. సక్సస్ అవుతాడా ?

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?