Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

- Advertisement -

ఇటీవల తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక ఎంతటి చర్చనీయాంశం అయిందో అందరం చూశాం. ప్రధాన పార్టీలన్నీ కూడా గెలుపుకోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక ఇప్పుడు ఏపీలో కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఈ మద్య విశాఖ కేంద్రంగా ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ విషయంలోనూ, అలాగే ఈ మద్య మూడు రాజధానుల విషయంలోనూ తరచూగా విశాఖ వార్తల్లో నానుతోంది. ఇక తాజాగా విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు జగన్ సర్కార్ సిద్దమవ్వడంతో అసలు విశాఖ కేంద్రంగా ఏం జరుగుతోందంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు..

ఇక ఇప్పుడు విశాఖ చుట్టూ ఉపఎన్నికకు సంబంధించిన చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా విశాఖపట్నం నార్త్ జోన్ ఎమ్మెల్యే టీడీపీ నేత గంట శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పట్లోనే స్పీకర్ కు సమర్పించారు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ హోల్డ్ లో పెట్టారు. ఇదిలా ఉంచితే ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీ విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గలాన్ని గట్టిగా వినిపించాలని రాజకీయ నాయకులు దృఢ నిశ్చయంతో ఉన్నారు.

అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను పునః పరిశీలించాలని స్పీకర్ కు మరోసారి లేఖ రాశారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ చుట్టూ కొనసాగుతున్న ఈ రాజకీయంలో గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే విశాఖలో ఉపఎన్నిక అనివార్యం అవుతుంది. ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికలు కూడా మరో ఏడాదిన్నర కాలంలో జరగనుండగా, ఒకవేళ విశాఖలో ఉపఎన్నిక జరిగితే.. రాజకీయ పార్టీలు ఈ బైపోల్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టమే కాబట్టి.. ఉపఎన్నిక వచ్చిన ఆశ్చర్యం లేదని కొందరు చెబుతున్నారు.మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మోడీ అమిత్ షా లను చెంప మీద కొట్టిన మునుగోడు ఓటర్లు !

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

బీజేపీ తెగించిందా.. ఏంటి ఈ కబ్జా రాజకీయాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -