Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణ జోలికొస్తే తాట తీస్తా.. మోడి ఫ్రస్టేషన్ !

- Advertisement -

ప్రధాని నేరంద్ర మోడీ రెండు తెలుగురాష్ట్రాల పర్యటనతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు ప్రధాని ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తారు ? ఏ పార్టీలపైనా విమర్శలు గుప్పిస్తారు అనే ప్రశ్నలు గట్టిగానే వినిపించాయి. ముఖ్యంగా ఏపీలో ప్రధాని పర్యటనపై పెద్దగా చర్చ లేనప్పటికి తెలంగాణలో మాత్రం ప్రధాని పర్యటన తీవ్ర చర్చనీయాంశం అయింది ఎందుకంటే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో తరచూ మోడీపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కానీ మోడీ మాత్రం కే‌సి‌ఆర్ వ్యాఖ్యలకు పెద్దగా స్పందించలేదు..

ఇక ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోవడం.. ఇదే సందర్భంలో మోడీ తెలంగాణకు రావడంతో అసలు మోడీ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన సభలో మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎప్పుడు కూడా తన ప్రసంగాల్లో అభివృద్ది గురించి వ్యాఖ్యానించే మోడీ.. ఈసారి మాత్రం రాజకీయ పరంగానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన ప్రసంగంలో ఎక్కువ శాతం కే‌సి‌ఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

తెలంగాణను దోచుకున్న వాళ్ళను విడిచిపెట్టేది లేదని, అవినీతి పాలనుకు, కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని మోడీ చెప్పుకొచ్చారు. తెలంగాణ సర్కార్ బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యలకు పాల్పడుతొందని, తెలంగాణ పేరుతో అన్నీ అనుభవిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో టాలెంట్ కు ఏమాత్రం కొదువలేదని, టాలెంట్ ఉన్నవారిని తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని, త్వరలోనే ఇక్కడ కమలం వికసించబోతుందని చెప్పుకొచ్చారు. తనను, తిట్టిన పర్వాలేదని కానీ తెలంగాణ ప్రజలను తిడితే తాట తీస్తామని హెచ్చరించారు. ఇలా మోడీ చేసిన ప్రసంగం అంతా కూడా కే‌సి‌ఆర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించేందుకే కేటాయించారు. మరి మోడీ వ్యాఖ్యలపై కే‌సి‌ఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

లోకేశ్ పాదయాత్ర సర్వం సిద్దం.. జగన్ తో పోలికా ?

కుప్పంలో జగన్.. పులివెందులలో బాబు.. నిలిచి గెలిచేదెవ్వరు ?

రాష్ట్రాన్ని పాలించేది గవర్నర్లా .. ముఖ్యమంత్రులా ? అసలేంది ఈ రచ్చ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -