టాలీవుడ్ లో గాసిప్పులకు ఏమాత్రం కొదవలేదు. ఓ హీరో హీరోయిన్ పెయిర్ క్రేజీగా అనిపిస్తే చాలు వారి ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ పుట్టిస్తారు. ఇక ఒకే సినిమాలో నటించకపోయిన సరే ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అంటే మాత్రం ఆలోచించాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి ఎఫైర్ చాలానే ఉన్నాయి.
అయితే ఈ మధ్య దగ్గుబాటి రానా క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య మంచి ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడుస్తుందని టాలీవుడ్ వర్గాల టాక్. ఎక్కడ కనిపించినా ఇద్దరు జోడిగా ఉండటంతో ఈ వార్తలకు ఊపొచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రానా రకుల్ తో క్లోజ్ గా ఉండటం తో వారిద్దరు ఏదో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అంటున్నారు. ఇదవరకు త్రిషతో సంథింగ్ సంథింగ్ నడిపించిన రానా అది కేవలం ఫ్రెండ్ షిప్ అనేసి కొట్టిపారేశాడు.
ఇక ఇప్పుడు రకుల్ తో కూడా తను చేసేది ఫ్రెండ్ షిప్ అంటాడో లేక మరేదైనా పేరు పెడతాడో చూడాలి. టాలీవుడ్ లో అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ సంపాదించిన హీరోయిన్గా రకుల్ మంచి పాపులారిటీ సంపాదించింది. బాహుబలితో రానా ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో తెలిసిందే. సో ఈ లెక్కన భళ్లాదేవకు రకుల్ ఫ్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు మెగా హీరోలతో చనువుగా ఉన్న రకుల్ సడెన్ గా రానాతో క్లోజ్ గా మూవ్ అవుతుందట. మరి ఇద్దరి మధ్య అసలు మ్యాటర్ ఏంటో వారు నోరు విప్పితే గానీ ఫిల్మ్నగర్లో గుసగుసలు ఆగేలా లేవు.
Related